రాష్ట్రంలో గ్రూప్ -1 సర్వీస్ పోస్టులకు ఎంపికైన 562 అభ్యర్థుల జాబితాను... బుధవారం అర్ధరాత్రి TGPSC ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా.. ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో ఒక పోస్టును న్యాయవివాదం వల్ల విత్ హెల్డ్ లో పెట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు గ్రూప్-1 విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TGPSCకి హైకోర్టు ఊరట కల్పించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నియామక ప్రక్రియ చేపట్టవచ్చని... తుదితీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 15కు వాయిదా వేసింది