తెలంగాణ ఐసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యారు. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను icet.tgche.ac.in అధికారిక వెబ్‌సైట్ నుండి తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు, ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. అభ్యర్థులకు ఏమైన అభ్యంతరాలు ఉంటే జూన్ 22 నుంచి 26వరకు తెలపాలని అధికారులు సూచించారు. 2025-26 విద్యా ఏడాదిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ నిర్వహించారు. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను రిలీజ్ చేశారు.