తెలంగాణలో కులగణన జరగకుంటే అసలు ఎన్నికలు కూడా జరగవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కులగణన కోసం అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టామన్నారు. మరో నాలుగైదు రోజుల్లో కులగణనకు సంబంధించిన విధివిధానాలు రావొచ్చని, కులగణనపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వివరించారు. కులగణన చేయకపోతే టీపీసీసీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ కు చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయని మల్లికార్జున్ ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కులగణన కార్యక్రమాన్ని బేగంపేట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టిపిపిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హాజరైయ్యారు.