TS : తెలంగాణ రాష్ట్ర గీతం ప్రత్యేకతలు ఇవే!

Update: 2024-05-22 06:06 GMT

జయజయహే తెలంగాణ అంటూ ప్రముఖ కవి అందెశ్రీ రాసిన గీతంలో స్వల్ప మార్పులు చేసింది రాష్ట్రప్రభుత్వం. సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను.. జూన్ 2న దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరించనున్నారు. కీరవాణి స్వీయగాత్రంలో స్వరకల్పన చేసిన ఈ గీతాన్ని విని ఓకే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

ఒకటిన్నర నిమిషం నిడివితో ఈ గీతం సిద్ధం చేశారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు కావస్తున్నందున పదేళ్ల పండుగను గ్రాండ్ గా జరపనున్నారు. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

మంగళవారం రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలా బాగుందని రేవంత్ మెచ్చుకున్నారు. అయిదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది కానీ.. సర్వ సాధారణంగా మాత్రం 90సెకండ్ల పాటు సాగే 2 చరణాలను రాష్ట్రం గీతంగా ప్రకటించారు. ఈ రెండు చరణాల్లో తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉంటుంది.

Tags:    

Similar News