Rains in Telangana : తెలంగాణలో 5రోజులపాటు వర్షాలు.. 23జిల్లాలకు ఎల్లో అలర్ట్
రానున్న మరో 5రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్‌మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబగద్వాల, జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 40కి.మి వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
కాగా, గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహబూబాబాద్‌లో 122.3మి.మి వర్షం కురిసింది. వెల్దండలో 100.8, బంజారాహిల్స్‌లో 87.5, మలక్‌పేటలో 85.3, యూసఫ్‌గూడలో 84.3, బేగంబజార్‌లో 83, గోల్కొండలో 76.8, నాంపల్లిలో 76.3 ఇ.మి వర్షం కురిసింది. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.రాష్ట్రంలోని 460 కేంద్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా అదిలాబాద్‌ల ఓ41.9డిగ్రీలు నమోదైంది.