TG : తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ.. ఎక్కడంటే?

Update: 2024-12-21 09:30 GMT

తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తికాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి. ఉమ్మడి జిల్లాల పరంగా నల్గొండ, నిజామాబాద్‌లలో కళాశాలలు లేవు. ఈ రెండు చోట్ల వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో మఠంపల్లిలో కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News