సచివాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు నిరసన తెలుపుతున్నారు. సచివాలయం ముట్టడికి బెటాలియన్ పోలీసుల కుటుంబాలు పిలుపునివ్వడంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సచివాలయం ముట్టడి ఉండే అవకాశం ఉండటంతో ముందస్తుగా మీడియా వారిని అనుమతించటం లేదు.