Tension in Nalgonda : నల్గొండలో ఉద్రిక్తత.. కంచర్లపై కాంగ్రెస్ నేతల దాడి
నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల ముందే మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నల్గొండ మున్సిపల్ ఆఫీస్ నుండి కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు.
అంతకు ముందు నల్గొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ మహాధర్నా ఫ్లెక్సీలు తొలగించడాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్గొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడంతో కమిషనర్ ఛాంబర్‌లోనే బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. దాంతో వారిని పోలీసులు బయటకు లాక్కెళ్లారు.