శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ,ఎంఐఎం నేతల మధ్య బైక్ గొడవ పెద్దదైంది. MIM కార్యకర్తలు ఓల్డ్ సిటీ గుండాల్లా మారారని ఫైర్ అయ్యారు బీజేపీ యువమోర్చా నేతలు. కావాలనే తమపై దాడికి యత్నించారన్నారని ఆరోపించారు. చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసిన వారిపై వెంటనే FIR నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అటు MIM నేతలు మాత్రం ముందు బీజేపీ వాళ్లే దాడికి యత్నించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఇష్యూపై దర్యాప్తు చేస్తున్నారు.