TG: మధ్య తరగతి సొంతింటి కల నెరవేర్చే ప్రణాళికలు
మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక చర్యలు... హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ప్లాట్లు.. తక్కువ ధరకే 339 ప్లాట్లు అమ్మకానికి సిద్ధం
తెలంగాణ గృహనిర్మాణ మండలి అల్పాదాయ వర్గాల (LIG) కోసం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో 339 ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో కేవలం రూ. 11.25 లక్షలకే ఫ్లాట్ పొందే సువర్ణావకాశం కల్పించింది. వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉన్నవారు ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. గచ్చిబౌలిలో రూ. 26 లక్షల నుండి.. వరంగల్‌లో రూ. 19 లక్షల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి గల వారు ఆన్లైన్ లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 6 నుండి 10వ తేదీ వరకు లాటరీ పద్ధతిలో ఈ ఫ్లాట్లను కేటాయిస్తారు. ఖమ్మం నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో మొత్తం 126 ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ధరలు రూ. 11.25 లక్షల నుండి ప్రారంభమై రూ. 19 లక్షల వరకు మాత్రమే ఉండటం విశేషం. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఇది సగం కంటే తక్కువ ధర కావడం గమనార్హం. కేవలం ఖమ్మమే కాకుండా.. హైదరాబాద్ , వరంగల్ నగరాల్లో కూడా హౌసింగ్ బోర్డు ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఐటీ హబ్ సమీపంలోని గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు ఉన్నాయి. వీటి ధర రూ. 26 లక్షల నుండి రూ. 36.20 లక్షల వరకు ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్మెంట్లలో 102 ఫ్లాట్లు ఉండగా.. వీటి ధర రూ. 19 లక్షల నుండి రూ. 21.50 లక్షల వరకు నిర్ణయించారు.
గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు..
హౌసింగ్ బోర్డు అధికారుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్‌లో 126 ఫ్లాట్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకునేవారికి వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి. ఫ్లాట్ల పరిమాణం 450 నుంచి 650 చదరపు అడుగుల మధ్య ఉంటుంది. ధరల విషయానికి వస్తే.. గచ్చిబౌలిలో ఫ్లాట్ల ధరలు రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు, వరంగల్‌లో రూ.19 లక్షల నుంచి రూ.21.50 లక్షల వరకు, ఖమ్మంలో అత్యల్పంగా రూ.11.25 లక్షల వద్ద ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న అర్హులైన దరఖాస్తుదారులు జనవరి 3వ తేదీలోపు ఆన్లైన్లో లేదా మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గచ్చిబౌలిలో జనవరి 6న, వరంగల్‌లో జనవరి 8న ఖమ్మంలో.. జనవరి 10న లాటరీ నిర్వహించనున్నారు. ఈ 339 ఫ్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని హౌసింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వీపీ గౌతమ్ తెలిపారు. అధికారిక వెబ్సైట్