TG: బంద్ విరమించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు
కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థలు
తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లించేందుకు హామీ ఇచ్చారు. నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో రీయింబర్స్మెంట్ స్కీమ్ ప్రారంభమైంది. ఆ తరువాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఈ స్కీమ్‌ను కొనసాగించారు. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను 3 నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి.