TG: హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ

అప్పుడైనా ఇప్పుడైనా మేలు చేసింది కాంగ్రెస్సే.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలు.. సినీ రంగ ప్రముఖులు, శ్రీరంగ కార్మికులతో భేటీ

Update: 2025-11-06 03:00 GMT

హై­ద­రా­బా­ద్‌­లో అం­త­ర్జా­తీయ ప్ర­మా­ణా­ల­తో కూ­డిన ఫి­లిం సిటీ ఏర్పా­టు చేసే ఆలో­చ­న­లో తమ ప్ర­భు­త్వం ఉం­ద­ని డి­ప్యూ­టీ సీఎం మల్లు భట్టి వి­క్ర­మా­ర్క చె­ప్పా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్నిక ప్ర­చా­రం­లో భా­గం­గా రా­ష్ట్ర మం­త్రి కో­మ­టి­రె­డ్డి వెం­క­ట­రె­డ్డి­తో కలి­సి బు­ధ­వా­రం జూ­బ్లీ­హి­ల్స్‌­లో­ని తె­లు­గు క్ల­బ్‌­లో సినీ రంగ ప్ర­ము­ఖు­లు, సినీ రంగ కా­ర్మిక నే­త­ల­తో జరి­గిన సమా­వే­శం­లో ఆయన మా­ట్లా­డు­తూ.. చాలా మంది సినీ పరి­శ్రమ గు­రిం­చి చాలా మంది చాలా రకా­లు­గా మా­ట్లా­డు­తు­న్నా­రు గానీ.. ఉమ్మ­డి రా­ష్ట్రం­లో గానీ, తె­లం­గా­ణ­లో కానీ సినీ పరి­శ్ర­మ­కు కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వాల హయాం­లో­నే మేలు జరి­గిం­ద­న్నా­రు. వే­లా­ది మంది సినీ కా­ర్మి­కుల జీ­వి­తా­ల­ను మె­రు­గు పర్చ­డా­ని­కి, చె­న్నై నుం­చి సినీ పరి­శ్ర­మ­ను తర­లిం­చి­న­ప్పు­డు హై­ద­రా­బా­ద్‌­లో సినీ స్టూ­డి­యోల ని­ర్మా­ణా­ని­కి కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వ­మే భూ­ము­లు ఇచ్చిం­ద­ని గు­ర్తు చే­శా­రు. అన్న­పూ­ర్ణ, పద్మా­లయ, రా­మా­నా­యు­డు తది­తర సి­ని­మా స్టూ­డి­యో­లు కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వాల ఆధ్వ­ర్యం­లో­నే ప్రా­రం­భ­మ­య్యా­య­న్నా­రు.

 మేలు చేసింది మేమే

తె­లం­గాణ రా­ష్ట్రం­లో సినీ పరి­శ్రమ గు­రిం­చి చా­లా­మం­ది చాలా రకా­లు­గా మా­ట్లా­డు­తు­న్నా­రు కానీ నాడు ఉమ్మ­డి రా­ష్ట్రం­లో నేడు ప్ర­త్యేక రా­ష్ట్రం­లో సినీ పరి­శ్ర­మ­కు ఏదై­నా మేలు జరి­గిం­ది అంటే అది కాం­గ్రె­స్ ప్ర­భు­త్వాల ఆధ్వ­ర్యం­లో నే అని డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క మల్లు అన్నా­రు. వే­లా­ది­మం­ది సినీ కా­ర్మి­కుల జీ­వి­తా­ల­ను మె­రు­గు­ప­ర­చ­డా­ని­కి, చె­న్నై­లో ఉన్న సినీ పరి­శ్ర­మ­ను హై­ద­రా­బా­ద్ రప్పిం­చ­డా­ని­కి సినీ స్టూ­డి­యో­లు ని­ర్మిం­చేం­దు­కు ప్ర­భు­త్వ­మే భూ­ము­లు ఇచ్చిం­ద­ని వి­వ­రిం­చా­రు. ఒక అన్న­పూ­ర్ణ, పద్మా­లయ, రా­మా­నా­యు­డు తది­త­ర­సి­ని స్టూ­డి­యో­లు అన్ని కాం­గ్రె­స్ ప్ర­భు­త్వాల ఆధ్వ­ర్యం­లో­నే ప్రా­రం­భం అయ్యా­య­ని వి­వ­రిం­చా­రు. ఫి­లిం క్ల­బ్ కు స్థ­లం సైతం కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యం­లో­నే ఇవ్వ­డం జరి­గిం­ద­ని అన్నా­రు. సినీ కా­ర్మి­కుల కోసం సీ­ని­య­ర్ నటు­డు ప్ర­భా­క­ర్ రె­డ్డి ఆధ్వ­ర్యం­లో చి­త్ర­పు­రి కా­ల­నీ ఏర్పా­టు కోసం ది­వం­గత సీఎం వై­ఎ­స్ రా­జ­శే­ఖ­ర్ రె­డ్డి­ని అడి­గి­మ­రీ ఏర్పా­టు చే­యిం­చా­ర­ని గు­ర్తు చే­శా­రు. సినీ పరి­శ్ర­మ­కు ఏ సమ­స్య వచ్చి­నా ఎలాం­టి వి­న­తి వచ్చి­నా పరి­ష్క­రిం­చేం­దు­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం సి­ద్ధం­గా ఉం­ద­ని తె­లి­పా­రు. హై­ద­రా­బా­ద్ గొ­ప్ప­న­గ­రం అన్ని భాషల వా­రి­ని అక్కున చే­ర్చు­కుం­టుం­ది. ఇం­ట­ర్నే­ష­న­ల్ ఎయి­ర్‌­పో­ర్ట్ చక్క­టి వా­తా­వ­ర­ణం తక్కువ ధరకే మానవ వన­రు­లు లభ్యత హై­ద­రా­బా­ద్ కే సొం­తం అన్నా­రు.

ఫిలిం క్లబ్‌కు స్థలం కేటాయించాం

ఫి­లిం క్ల­బ్‌­కు సైతం కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వ­మే స్థ­లం కే­టా­యిం­చిం­ద­ని భట్టి చె­ప్పా­రు. సీ­ని­య­ర్‌ నటు­డు ప్ర­భా­క­ర్‌ రె­డ్డి ఆధ్వ­ర్యం­లో సినీ కా­ర్మి­కుల కోసం ది­వం­గత సీఎం వై­ఎ­స్‌­ను అడి­గి మరీ చి­త్ర­పు­రి కా­ల­నీ­ని ఏర్పా­టు చే­యిం­చా­ర­ని పే­ర్కొ­న్నా­రు. సినీ పరి­శ్ర­మ­కు ఏ సమ­స్య వచ్చి­నా.., ఎటు­వం­టి వి­జ్ఞ­ప్తు­లు వచ్చి­నా పరి­ష్కా­రా­ని­కి తమ ప్ర­భు­త్వం సి­ద్ధం­గా ఉం­ద­న్నా­రు. అన్ని భాషల వా­రి­ని అక్కున చే­ర్చు­కు­నే గొ­ప్ప నగరం హై­ద­రా­బా­ద్‌­లో అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం, చక్క­టి వా­తా­వ­ర­ణం­తో­పా­టు తక్కువ ధరకే మానవ వన­రు­లు లభి­స్తా­య­ని భట్టి పే­ర్కొ­న్నా­రు. ప్ర­తి సం­ద­ర్భం­లో­నూ సినీ పరి­శ్ర­మ­కు కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వా­లు అం­డ­గా ని­ల­బ­డ్డా­య­ని, భవి­ష్య­త్తు­లో­నూ ని­ల­బ­డ­తా­య­ని స్ప­ష్టం చే­శా­రు. సినీ పరి­శ్రమ ఎంత బాగా ఎది­గి­తే అంత మం­ది­కి ఉపా­ధి లభి­స్తుం­ద­ని, తద్వా­రా రా­ష్ట్రం అభి­వృ­ద్ధి చెం­దు­తుం­ద­ని ఆయన చె­ప్పా­రు. తమ ప్ర­భు­త్వం బలం­గా ఉం­టే­నే సినీ పరి­శ్రమ బాగా ఎదు­గు­తుం­ద­న్న భట్టి.. సినీ పరి­శ్ర­మ­కు సం­బం­ధిం­చిన ప్ర­తి సమ­స్య పరి­ష్కా­రా­ని­కి ప్ర­య­త్ని­స్తా­మ­న్నా­రు. ఎఫ్‌­డీ­సీ చై­ర్మ­న్‌­తో మా­ట్లా­డి ‘మా’ అసో­సి­యే­ష­న్‌ కా­ర్యా­లయ ని­ర్మా­ణా­ని­కి స్థ­లం కే­టా­యిం­చి.. సినీ నటుల కల సా­కా­ర­మ­య్యేం­దు­కు యత్ని­స్తా­మ­న్నా­రు. భవి­ష్య­త్తు­లో మంచి సి­ని­మా­లు రా­వా­లి, చి­న్న సి­ని­మా­లు కూడా రా­వా­ల­ని భట్టి వి­క్ర­మా­ర్క చె­ప్పా­రు.

Tags:    

Similar News