తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమయిన సమావేశాలు..ఆతర్వాత వాయిదా వేసి ఈ నెల 16 నుంచి తిరిగి ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలు 7 రోజుల పాటు కొనసాగాయి. సభ్యుల నిరసనల మధ్యే ఒక వైపు బిల్లులు ఆమోదం తెలుపుతూ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, మరోవైపు చర్చలను కొనసాగించింది. ప్రధానప్రతిపక్షం నిరనసలు చేసినా సస్పెండ్ చేయకుండా సభను కొనసాగించారు. శుక్రవారం బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్యే అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చను కొనసాగించారు. చర్చలో అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు. భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మండలిలో కూడా ఇవాళ కీలక బిల్లులకు ఆమోదం పడనుంది. జీహెచ్ఎంసీ బిల్లు, తెలంగాణ మున్సిపల్ బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2024 బిల్లు, భూభారతి నాలుగు బిల్లులకు చట్టసభలు ఆమోదం తెలపనున్నాయి.