Telangana : నేటితో ముగియనున్న దోస్త్ గడువు..

Update: 2025-08-02 11:30 GMT

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. తెలంగాణ లో ఉన్న డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీకి ఈ ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం. దీని ద్వారా అప్లై చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల ద్వారా సీట్లు కేటాయిస్తారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో కలిపి మొత్తం 4.36 లక్షల సీట్లు ఉన్నాయి. ఐతే మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ దాదాపు 2 లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటించింది ప్రభుత్వం. ఈ స్పెషల్ ఫేజ్ గడువు జులై 31తో ముగియగా.. ఆగస్టు 2 వరకు పొడగించారు. ఇక మరోసారి పొడగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ ఫేజ్ కు సంబంధించి ఆగస్టు 6 న సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. కాగా స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందే వారికి స్కాలర్ షిప్స్ అవకాశం ఉండదని అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News