హైదరాబాదీలు బ్రేక్‌ఫాస్ట్‌గా దోశ ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసేది హైదరాబాద్ వాసులే అని ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో వివరించింది. అలాగే ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అటు, హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది. 2024లో ఏకంగా 15.7 మిలియన్ (దాదాపు 1.57 కోట్లు) బిర్యానీలను నగర యువత ఆర్డర్ చేశారట. కేవలం చికెన్ బిర్యానీ మాత్రమే కాదు పన్నీర్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పుట్టగొడుగులు, గుడ్డు.. అన్ని రకాల బిర్యానీలూ ఇందులో ఉన్నాయి. ప్రతి నిమిషానికీ 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. దేశంలో ఇంతగా బిర్యానీలను ఆర్డర్ చేసే నగరం మరేదీ లేదని ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. టీ20 సమయంలో హైదరాబాద్‌లో అత్యధికంగా 869 వేలు చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారు.