KTR : బిఆర్ఎస్ ఓటమికి కారణం ఇదే..

Update: 2025-11-15 11:15 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ తేడాతో ఓడిపోయింది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ కు సిట్టింగ్ సీటు. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని ముందు నుంచి కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. మాగంటి సునీతకు టికెట్ ఇవ్వడం వల్ల సింపతి ఓట్లు వస్తాయని.. పైగా సిట్టింగ్ సీటు కాబట్టి ఈజీగా గెలిచేస్తామని, హైడ్రా కూల్చివేతలు, జూబ్లీహిల్స్ లో తమ హయాంలో చేసిన డెవలప్మెంట్, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుంది అని కేటీఆర్ భావించారు. అయితే వ్యూహాలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో భారీ దెబ్బ పడింది. ఏకంగా సిట్టింగ్ సీటును కోల్పోవాల్సి వచ్చింది.

బిఆర్ఎస్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ సోషల్ మీడియాను ఎక్కువగా నమ్మడమే. సోషల్ మీడియాలో వచ్చే హైపును, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే పోస్టులు, రీల్స్, కామెంట్లను చూసి తమకు తిరుగు లేదని అనుకున్నాడు కేటీఆర్. తన చుట్టూ ఉన్న హడావిడిని నమ్మి గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడు. రాజకీయ దిగ్గజం అయిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండటం, వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన హరీష్ రావు తండ్రి మరణంతో దూరంగా ఉండటం, ఇవన్నీ కలిసి దెబ్బ కొట్టాయి.

వీటికి తోడు కల్వకుంట్ల కవిత చేస్తున్న కామెంట్లు బి ఆర్ ఎస్ కు మైనస్ గా మారాయి. హైడ్రా కూల్చివేతలు తమకు కలిసి వస్తాయని కేటీఆర్ భావించాడు. కానీ అదే హైడ్రా కూల్చివేతలు చేస్తున్న సమయంలో ఒక్కసారి కూడా గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి బాధితులను ఆదుకున్నట్లు ఉంటే ఆ పరిస్థితి వేరే ఉండేది. కానీ ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు అంటూ, హైడ్రా కూల్చివేతలు అంటూ ప్రజెంటేషన్లు ఇవ్వడం పెద్దగా ఓట్లను తీసుకురాలేకపోయింది. మీడియా హైపు, సోషల్ మీడియా ఊపు కలిసి బీఆర్ఎస్ ను ముంచేశాయి. హడావిడిని నమ్మితే సరిపోదు కదా. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కార్యకర్తలను పట్టించుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. పోల్ మేనేజ్మెంట్ అన్నింటికంటే ముఖ్యం. పైగా ప్రభుత్వ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. కానీ అవేవీ చేయకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే సరిపోదు కదా. అదే బి ఆర్ ఎస్ ను ఓడించింది.


Full View

Tags:    

Similar News