బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణల్లో ఇరు వర్గాలపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు అయినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. శుక్రవారం సీపీ మహంతి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు.
గురువారం కౌశిక్ ఇంట్లోకి గాంధీని వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. కార్యకర్తలు పోలీసులపై తిరగబడి ఇంట్లోకి చొరబడ్డారని, సీసీ టీవీ ఫుటేజ్, మీడియా వద్ద ఉన్న వీడియో ఫుటేజ్ లను పరిశీలించి ఇరు వర్గాలపై న్యాయ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకే శుక్రవారం ఇరు పక్షాల నేతలను హౌజ్ అరెస్టు చేశామన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగిందని, అలాగే ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.