TG : కేటీఆర్.. చదువుకున్న వ్యక్తిగా మాట్లాడాలి.. పీసీసీ చీఫ్ సెటైర్లు

Update: 2024-10-19 16:37 GMT

దేశం కోసం రాజీవ్ గాంధీ కుటుంబం త్యాగం చేసిందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఈనాడు దేశాన్ని పాలిస్తున్న నాయకులకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాత్ర ఉందా? అని ప్రశ్నించారు. మతం, కులం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా ఎడిటింగ్లు, మార్ఫింగ్లు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీ నది ప్రక్షాళనపై సీఎం స్పష్టత ఇచ్చినప్పటికీ లక్షలు కోట్లు అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

వాళ్లు దోచుకున్న తీరును అందరికీ ఆపాదిస్తే ఎలా? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేశ్. కేటీఆర్ చదువుకున్న వ్యక్తిగా వాస్తవాలు మాట్లాడాలని, చిన్న చిన్న తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కానీ విష ప్రచారం చేయడం, ఉన్నది లేనట్లు చెప్పే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను 90శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News