Revanth Reddy : రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..!
Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు.;
Revanth Reddy (tv5news.in)
Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్‌లో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి రేవంత్ ఇంటిదగ్గర భారీగా బలగాలను మొహరించారు పోలీసులు. హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిలోకి ఎలా వస్తారని ఏసీపీని ప్రశ్నించారు. మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లి రచ్చబండ సందర్భంగానూ రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.