Hyderabad : విషాదం.. వినాయక విగ్రహాలు తరలిస్తూ కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
గణేశ్ విగ్రహాలను తరలిస్తూ హైదరాబాద్ పాతబస్తీ, అంబర్‌పేట్‌లలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పలువురు వ్యక్తులు కరెంట్ షాక్‌కు గురై మరణించారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు విషాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పాతబస్తీ, అంబర్‌పేట్‌లో ప్రమాదాలు
పాతబస్తీలోని బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విగ్రహం అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపే ప్రయత్నంలో షాక్ తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు అంబర్‌పేట్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. రామ్ చరణ్ అనే యువకుడు విగ్రహాన్ని తరలిస్తుండగా, విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.