Moosarambagh : ఆ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.94 కోట్లను కేటాయించాం : తలసాని శ్రీనివాస్ యాదవ్
Moosarambagh : మూసారంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలకు రూ.94 కోట్లను కేటాయించామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్;
Moosarambagh : హైదరాబాద్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పర్యటించారు. ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలను పరిశీలించారు. పది రోజుల్లో ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి పనులను ప్రారంభిస్తామని మంత్రి తలసాని అన్నారు.
ముసారాంబాగ్ బ్రిడ్జికి 52 కోట్లు, చాదర్‌ఘాట్ బ్రిడ్జికి 42 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. బ్రిడ్జి పనులు జరిగే 9 నెలల పాటు రోడ్లను మూసివేస్తామన్న మంత్రి తలసాని.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రూట్ ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.