టీడీపీ కమిటీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణ రెండోసారి కొనసాగనున్నారు. 27మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ మరోసారి కొనసాగనున్నారు. అలాగే వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావులు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుల్లో ముగ్గురు మహిళలకు స్థానం కల్పించారు. గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి, సత్యప్రభతోపాటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సీఎచ్.కాశీనాథ్ జాతీయ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు.
మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బొండా ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ, గల్లా జయదేవ్, ఫరూక్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర ,గుమ్మడి సంధ్యారాణి తదితరులను తీసుకున్నారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణ కూడా సభ్యులుగా ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబుతోపాటు తెలంగాణ నుంచి నండూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, ప్రేమ్‌కుమార్ జైన్, నజీర్, దీపక్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు.
తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమించారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ టీడీపీ సమన్వయ కమిటీలో ఆరుగురు సభ్యులను నియమించారు.