తెలంగాణలో బీఈడీ సీట్ల భర్తీకి నేడు ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు 33,879 మంది దరఖాస్తు చేసుకోగా, 79 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
మొదటి సెషన్‌లో 16,929 మంది, రెండో సెషన్‌లో 16,950 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ రేపు జరగనుంది. ఈ పరీక్షకు 92,808 మంది అప్లై చేసుకోగా, మొత్తం 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.గత ఏడాది 1.05 లక్షల మంది పోటీపడ్డారు.