TG : తుమ్మల భావోద్వేగం.. కేసీఆర్ చేయని పనిని చేస్తున్నా!

Update: 2024-08-13 12:00 GMT

గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు.. రైతుల కోసమే తాను పని చేస్తాను తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు, తదితర అంశాలపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రాజెక్టు కోసమే వెంపర్లాడానని తెలిపారు తుమ్మల. గోదావరి జలాలు ఉమ్మడి జిల్లాకు అందాలంటే దుమ్ముగూడెం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తానే చెప్పానని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వాలు అనుకూలంగా స్పందిం చాయని గుర్తు చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఇదే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ని ఇందిరా సాగర్- రాజీవ్ సాగర్ అని రెండు భాగాలుగా విభజించారని చెప్పారు.

నాడు ఇదే ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశానని గుర్తుచేశారు తుమ్మల. దురదృష్టవశాత్తు నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆ ప్రాజెక్టు కుంటు పడిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని ఆరోపించారు.

Tags:    

Similar News