Hussain Sagar Boat Accident : హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి
హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో మరణాల సంఖ్య రెండుకు చేరింది. హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యం అయ్యింది. ఆదివారం నాడు జరిగిన పడవ ప్రమాద సమయంలో అజయ్ నీటిలోకి దూకాడు. 45 గంటల పాటు గాలించి అజయ్ మృతదేహన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. ఈ ప్రమాదంలో బాణసంచా మంటలు అంటుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరోవైపు అజయ్ మృతదేహాన్ని బంధువులకు చూపించకుండానే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దాంతో వారు ఆందోళనకు దిగారు.