ములుగు జిల్లా అడవుల్లో తూటా పేలింది. మంగపేట మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ముసలమ్మగుట్ట అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతులను ఇటీవల టీఆర్‌ఎస్ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌తో మంగపేట పరిసర ప్రాంతాల్లో అలజడి నెలకొంది.
ఈనెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.