TS : విత్తనాల కోసం ఆగని రైతుల కష్టాలు

Update: 2024-05-29 09:18 GMT

మెదక్ జిల్లా తూప్రాన్‌లో జీలుగు విత్తనాల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఫర్టిలైజర్‌ షాపుల దగ్గర జీలుగు విత్తనాల కోసం గంటల తరబడి చెప్పులు క్యూ లైన్లలో పెట్టి నిలబడుతున్నారు. జీలుగు విత్తనాల కోసం పర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్న స్టాక్‌ లేదంటూ అధికారులు సమాధానం చెబుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే వ్యవసాయ అధికారులు స్టాక్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై రివ్యూ చేస్తున్నామంటున్నారు అధికారులు. ప్రతిపక్షాలు అనవసరంగా హైలైట్ చేస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News