రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల దెబ్బకు హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఊహించని స్థాయిలో 25 నుంచి 32 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల జనం పీకల్లోతు నీళ్లలో ఇరుక్కుపోయారు. నదీంకాలనీలో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. మలక్‌పేట, దిల్‌షుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాచారం ఇలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడాలేదు.. వర్షపునీటిలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా మార్గం లేక అల్లాడిపోతున్నారు. సహాయ చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలకు అదనపు బృందాల్ని పంపాలని ఆదేశించారు. అటు, వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ, రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు.