Vande Bharat : సికింద్రాబాద్ - విశాఖ మధ్య మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Update: 2024-03-12 04:41 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ రైలును మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మొదటి వందే భారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు రెండో వందేభారత్ రైలు సికింద్రా బాద్-విశాఖపట్నం మధ్య నడవనుంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రా ల్లో విశాఖ పట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంత్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలులో 120 శాతం ఆక్యూపెన్సి రేషియో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. దేశంలోని రైల్వే ప్రయాణికుల సంక్షేమం, త్వరితగతిన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

సాధారణ రైళ్లకు భిన్నంగా సకల సౌకర్యాలు ఉండటంతో వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మూడో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News