Varavara Rao : వరవరరావుకు శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..

Varavara Rao : విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసింది.

Update: 2022-08-10 10:06 GMT

Varavara Rao : విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్యం, వయసు, మధ్యంతర బెయిల్‌ను దుర్వినియోగం చేయకపోవడం ఆధారంగా శాశ్వత బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. వరవరరావు చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని, బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదని NIA.. కోర్టుకు తెలిపింది.

అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ సైతం వరవరరావు బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, వరవరరావు పార్కిన్సన్‌ వ్యాధితో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది గ్రోవర్‌ వాదించారు. పైగా వరవరరావుపై ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసుల విచారణకు దాదాపు 15 ఏళ్లు పడుతుందని స్వయంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పారు. ఇప్పటికే 82 ఏళ్ల వయసు, రెండున్నరేళ్లు జైల్లో ఉన్నందున.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసింది.

Tags:    

Similar News