TSRTC: టీఎస్‌ఆర్‌టీసీ పబ్లిసిటీకి సజ్జనర్ ఐడియా అదుర్స్.. మహేశ్ బాబు ఫోటోతో..
TSRTC: ఈకాలంలో ఏ విషయమయిన మామూలుగా చెప్తే ఎవరూ పట్టించుకోవట్లేదు.;
VC Sajjanar (tv5news.in)
TSRTC: ఈకాలంలో ఏ విషయమయిన మామూలుగా చెప్తే ఎవరూ పట్టించుకోవట్లేదు. అది సీరియస్ విషయమే అయినా ఎంటర్‌టైనింగ్‌గా చెప్తేనే అందరూ వింటున్నారు. అలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడానికి ఉపయోగపడుతున్న అస్త్రమే 'మీమ్స్'. ఈ మీమ్స్ అనేది ప్రస్తుతం చాలామంది జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాయి. అందుకే ప్రజలకు టీఎస్‌ఆర్‌టీసీ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వీసీ సజ్జనార్ కూడా ఈ మీమ్స్‌నే ఆశ్రయించారు.
ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సెంచరీ కొట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు.. త్వరలోనే డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు ప్రజలు. అందుకే చాలామంది సొంత వాహనాలను వదిలేసి.. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఎలాగో తప్పదు కదా.. అని పెట్రోల్ ధరలను బరిస్తూ సొంత బండ్లపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అలాంటి వారికోసమే టీఎస్‌ఆర్‌టీసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
టీఎస్ఆర్‌టీసీ 'డే పాస్' సౌలభ్యాన్ని ఎప్పటినుండో ప్రజలకు అందిస్తూనే ఉంది. డే పాస్ అంటే ఒక్కరోజు బస్ పాస్. ఈ పాస్‌తో సిటీలో ఎక్కడి నుండి ఎక్కడికైనా బస్సులలో ప్రయాణించవచ్చు. ఒకప్పుడు ఈ డే పాస్‌కు ఫుల్‌గా క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య ప్రజలు ఎవరూ ఎక్కువగా దీన్ని పట్టించుకోవట్లేదు. అందుకే ఇది మరొక కొత్త రూపంలో అందరికీ అందుబాటులోకి రానుంది.
డే పాస్‌కు టీ24 టికెట్ అని పేరు మార్చింది టీఎస్‌ఆర్‌టీసీ. ఈ టీ24 టికెట్‌తో 'నగరమంతా బస్సులలో 24 గంటలు ప్రయాణించండి' అనే ఆఫర్‌ను అందిస్తోంది ఆర్‌టీసీ. ఈ విషయాన్ని వీసీ సజ్జనార్ కాస్త వెరైటీగా మీమ్ రూపంలో అందరికీ తెలియజేశారు. మహేశ్ బాబు ఫోటోతో ఉన్న ఒక మీమ్‌ను షేర్ చేస్తూ టీ24 టికెట్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సజ్జనర్. దీంతో ఆయన క్రియేటివిటీకి సోషల్ మీడియా వావ్ అంటోంది.
Travel in #TSRTC Safely with less cost#sundayvibes @urstrulyMahesh @puvvada_ajay @Govardhan_MLA @RGVzoomin @DarshanDevaiahB @HUMTA_hmdagov @airnews_hyd @maheshbTOI @balaexpressTNIE @V6_Suresh @PranitaRavi @baraju_SuperHit @abntelugutv @AbhiramNetha @iAbhinayD @Telugu360 @TSRTCHQ pic.twitter.com/hvQVZytMNe
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 31, 2021