ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సీపీఐ కురువృద్ధుడు దొడ్డ నారాయణ రావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో కన్నుమూశారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు నిలబడిన మహోన్నత వ్యక్తి దొడ్డ నారాయణ రావు. తెలంగాణ సాయుధ పోరాటం తో పాటు, పలు రైతు ఉద్యమాలలో సైతం ఆయన కీలక పాత్ర పోషించారు.నారాయణ రావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ సీనియర్ నేతలు నారాయణ తో పాటు పలువురు సంతాపం తెలిపారు. సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.కాగా, గతేడాది ఆగస్టు లో ఆయన సతీమణి సక్కుబాయి (85) అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే..