TG : టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి పేగుబంధం తెంచుకున్నం : వినోద్ కుమార్
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల తాము తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని, దురదృష్టవశాత్తు ఇందులో తాను కూడా పాత్రధారినేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ( Vinod Kumar ) అన్నారు.. బీఆర్ఎస్ పవర్‌లో లేకపోయినా పవర్‌ఫుల్ పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అంశంతో ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని తాజాగా జరిగిన పార్టీ మీటింగ్‌లో చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు వినోద్ కుమార్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయినప్పటికీ.. ప్రజలు, ఉద్యమకాలం నాటి కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్‌లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో యువతకు టికెట్లు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు వినోద్.
తెలంగాణ శాసనమండలి ఉనికి ప్రమదంలో పడిందని మాజీ ఎంపీ బోయిన్‌లపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉంది అని ఆయన పేర్కొన్నారు.