TG : డిసెంబర్ లోగా నాలుగు టిమ్స్ లను ఓపెన్ చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి
డిసెంబర్ లోగా నాలుగు టిమ్స్ లను ఓపెన్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లో అల్వాల్ లోని టిమ్స్ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల మధ్య సమ న్వయం లేకపోవటంతోనే ఆలస్యమైందన్నారు. ' 897 కోట్లతో ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 90శాతం పనులు కంప్లీట్చేశాం. పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేసి సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తం. సీఎం టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలపై ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నారు. ఎల్.బీ నగర్ టిప్స్క పనులు భూమి సమస్య కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పటివరకు 27 శాతం మించి పనులు కాలేదు. సీఎంతో చర్చించి ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్న. హా స్పిటల్ భూమికి ఇబ్బందిగా మారిన భూసమ స్యను పరిష్కరించగత ప్రభుత్వం ఒక్కో పనికి ఒక్కో టెండర్ పిలిచి అంత గందరగోళం చేస్తే.. అన్నింటిని సరిదిద్దా. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ లాగా.. పది మంది మెచ్చేలా హాస్పిటల్ ను నిర్మిం చండి. మేజర్ ఓటీ, ఏమర్జెన్సీ, రెడీయల్ వార్డ్, ఆంకలాజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. పరేషన్ థియేటర్,ఇతర మెడికల్ వార్డ్స్ నిర్మాణాలపై వైద్యశాఖ అధికా రులతో సమన్వయం చేసుకోవాలి' అని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.