TG : నాచారంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారంలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలు, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలపై చర్చించారు. నాచారంలో స్కూల్ బస్సులు, పెట్రోల్ ట్యాంకర్లు, గ్యాస్ లారీలు, తదితర వాహనాలతో రద్దీ ఎక్కువగా ఉంటుందని, హబ్సిగూడ జంక్షన్ ప్రాంతంలో ఫ్రీలెప్ట్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.హబ్సిగూడ సిగ్నల్ ప్రాంతంలో రోడ్డును విస్తరించాలని ఎమ్మెల్యేను, అధికారులను కోరారు. యూటర్న్ సమస్యలతో కాలనీలకు వెళ్లే ప్రజలు రాంగ్‌రూట్లో ప్రయాణిస్తున్నారని, వాటిపై తగిన చర్యలు చేపట్టాల న్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్, నాచారం సీఐ రుద్విర్‌కుమార్, కాప్రా ఈఈ నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.