TPCC Chief Mahesh Goud : జూబ్లిహిల్స్ రేసులో గెలిచేది మేమే : పీసీసీ చీఫ్

Update: 2025-06-30 07:00 GMT

హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, అంతేగాక విజయబాపుటా ఎగురవేస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం ఇప్పటి నుంచే నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు పర్యటనలు జరపాలని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లి వివరించాలని సూచించారు. ఆదివారం గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీపీసీ మాజీ అధ్యక్షుడు విహన్మంతరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నాంపల్లినేత ఫిరోజ్ ఖాన్, కార్పోరేషన్ చైర్మన్లు మెట్టుసాయికుమార్, దీపక్ జాన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పోరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలని, మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పారు. 

Tags:    

Similar News