Minister Ponnam : రిపబ్లిక్ డే నుంచి సంక్షేమ జాతర.. పొన్నం ప్రకటన

Update: 2025-01-17 11:30 GMT

ఈ ఏడాది జనవరి 26 నుంచి రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతులకు రైతు భరోసా నిధులు అందుతాయన్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు. తెలంగాణ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల మద్దతు ధర రూ.7,550 ప్రభుత్వం కందుల కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు కందులను మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. గతంలో వడ్లు, పత్తి, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పని చేశాయన్నారు. వడ్ల కొనుగోలు చేసిన 48 గంటలలో పేమెంట్ చేశామని పొన్నం తెలిపారు.  

Tags:    

Similar News