DK Aruna : తండ్రికి లేఖ రాయడం ఏంటి.. ప్రశ్నించిన డీకే అరుణ

Update: 2025-05-23 12:15 GMT

కేసీఆర్ ను కవిత కలవట్లేదా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. అసలు తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం కవితకు ఎందుకు వచ్చిందన్నారు. కేసీఆర్ కు తన కూతురు ఎమ్మెల్సీ కవిత రజతోత్సవ సభపై లేఖ రాయడంపై బీజేపీ ఎంపీ స్పందించారు. ఎప్పుడంటే అప్పుడే తండ్రిని కలిసే అవకాశం ఉంటుందన్నారు. కవిత అసలు లెటర్ రాయడానికి గల ఉద్దేశం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. ' మరోవైపు కేటీఆర్ చెల్లెలు మధ్య, కుటుంబంలో ఏదైనా డిఫరెన్సెస్ ఉందా? అసలు ఇది కవిత రాసిన లేఖనా? కాదా? నిన్నటి నుంచి లేఖ చక్క ర్లు కొడుతున్న ఇప్పటివరకు దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇది కాంగ్రెస్, బీఆ ర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావొచ్చు. తెలంగాణలో బీజేపీ పార్టీని వీక్ చేయాలని.. రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ పార్టీని అడ్డుకోవాలనే ఈ లేఖ డ్రామాలు చేస్తున్నారు. లెటర్ కేసీఆర్ వరకు చేరిందా? మధ్యలోనే బయటకు వచ్చిందా అనేది కూడా తెలియాలి.’ అని డీకే అరుణ అన్నారు.

Tags:    

Similar News