తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 7 నుంచి మొదలైన వ్యాల్యుయేషన్, ఈ నెల 15 లేదా 17వ తేదీతో ముగియనుంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా మరోసారి పరిశీలన చేసి, ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయనున్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాలు ఎలా చేపడతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా, కాలేజీలకు గ్రేడింగ్ ఇవ్వడం, ఫీజులు నిర్ణయించడం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వమే ఫీజులు నిర్ణయిస్తే, కాలేజీలు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. దీంతో పాత విధానంలోనే ముందుకెళ్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులపై చర్చ నడుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 20 నుంచే సెలవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్కూళ్లకు ఎప్పట్నుంచి సెలవులు ఇస్తారనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ముందే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలోనే దీనిపై విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.