TG : మూడేళ్లలో రేవంత్ ఏ పార్టీలో ఉంటారో? MLA రాకేశ్ రెడ్డి సెటైర్లు

Update: 2025-03-01 12:15 GMT

వచ్చే ఎన్నికల నాటికి సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటారో తెలియదని బీజేపీ సీనియర్ నేత, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కంద్ర మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను దిక్కుమాలినదిగా కొట్టిపారేశారు. రాష్ట్ర అభివృద్ధి అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని, దమ్ముంటే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. రాబర్టు వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. అవినీతి ప్రాజెక్టులు తప్ప ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రేవంత్ ను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి ఎన్నడూ పార్టీ మారలేదని గుర్తు చేశారు. కేంద్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధికే మొగ్గు చూపుతోందన్నారు.

Tags:    

Similar News