మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడో ఒకసారి అసెంబ్లీకి వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ ఒకరోజు మాత్రమే సమావేశాలకు వచ్చి సైలెంట్ గా ఉండి వెళ్ళిపోతున్నారు. రెండో రోజు నుంచి అసెంబ్లీకి రావట్లేదు. చాలాకాలం తర్వాత ఆయన నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. కానీ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. ప్రతిసారి అసెంబ్లీకి కేసిఆర్ వస్తున్నారంటే ఒక పెద్ద హైపు తీసుకువస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ హైప్ కు తగ్గట్టు కెసిఆర్ మాట్లాడట్లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఇదే ఇక్కడ అనేక ప్రశ్నలకు తావిస్తోంది. కెసిఆర్ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ పదే పదే పట్టుబడుతోంది. కెసిఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆ బాధ్యత పోషించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ.
వాళ్ల డిమాండ్ ప్రకారం కేసీఆర్ అప్పుడప్పుడు వస్తున్నా సరే మాట్లాడట్లేదు. ఏదో అలా వచ్చి కూర్చుని వెళ్లిపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ మాత్రం దానికి కెసిఆర్ అసెంబ్లీకి అసలు ఎందుకు వస్తున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది. ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడితే వినాలని ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అలా మాట్లాడితే కెసిఆర్ కే ప్లస్ అవుతుంది కదా. ఒకవేళ అసెంబ్లీలో కేసీఆర్ ను మాట్లాడనివ్వకపోతే అది కూడా బిఆర్ఎస్ పార్టీకి సింపతీని తీసుకొస్తుంది. ఈ విషయాలు కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి తెలియనివి కావు.
అన్నీ తెలిసి కూడా కెసిఆర్ ఇలా వచ్చి వెళ్లడం వల్ల అది బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు కదా. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిందే. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు వెనకడుగు వేయకుండా ప్రతి సమావేశంలోనూ తన గొంతు వినిపించారు. ప్రజల తరఫున ప్రశ్నించారు. చివరకు జగన్ బ్యాచ్ అవమానిస్తే బయటకు వచ్చారు. మరి ఇప్పుడు కేసీఆర్ అంత వరకు కూడా వెయిట్ చేయట్లేదు కదా. ఒకవేళ కాంగ్రెస్ అవమానిస్తే అప్పుడు కేసీఆర్ బయటకు వచ్చినా సరే దాన్ని మీద ప్రజల్లో సింపతి ఏర్పడుతుంది. అవేమీ చేయకుండా కాంగ్రెస్ టార్గెట్ చేయడం కోసమే వెయిట్ చేస్తుంది అన్నట్టు వీళ్ళు ముందే చెప్పడం పెద్దగా వర్కౌట్ కావట్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కెసిఆర్ ఎన్నడు మాట్లాడుతాడో వెయిట్ చేయాలి.