తెలంగాణ బిడ్డలతో విదేశీ సుందరీమణుల కాళ్లు కడిగించడం సరికాదని, ఇదీ ముమ్మాటికీ ఈ ప్రాంత ఆడబిడ్డల ఆత్మగౌరవం గాయపడే చర్య అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయం లో మిస్ వరల్డ్ పోటీ భాగస్వాముల పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందన్నారు. ' సుందరీమణుల కాళ్లకు నీళ్లు పోసి, తుడిపించే బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ యువతిపై, మహిళలపై మోపడం అనేది అత్యంత అవ మానకరం. విదేశీ యువతుల పాదాల వద్ద మన ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం బాబాధాకరం. మన సాంప్రదాయాలను గౌరవిం చాలి కాని అవమానించడం సరికాదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సంఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలి.' అని డీకే అరుణ డిమాండ్ చేశారు.