Bathula Shivdhar Reddy : పోలీసులపై నమ్మకం పెంచేలా పని చేస్తా: కొత్త డీజీపీ శివధర్ రెడ్డి...

Update: 2025-09-27 10:01 GMT

రాష్ట్రంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి. రాష్ట్రానికి కొత్త డీజీపీ గా ఎన్నికైన ఆయన...మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు పోలీసుల పై నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానని.. పోలీసు వృతి అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిని వదిలి పట్టుదలతో సివిల్స్ కి ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించానని తెలిపారు. మవోయిస్టుల వ్యవస్థ దాదాపు అంతమైనట్లేనని అన్నారు. గతంలో వివిధ జిల్లాల ఎస్పీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ పనిచేసిన అనుభవంతో తెలంగాణ పై తనకు పూర్తి పట్టు ఉందని డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News