కరీంనగర్‌లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..!
సాధారణంగా కవల పిల్లలు జన్మిస్తేనే అబ్బురంగా చూస్తాం.. అలాంటిది కరీంనగర్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.;
సాధారణంగా కవల పిల్లలు జన్మిస్తేనే అబ్బురంగా చూస్తాం.. అలాంటిది కరీంనగర్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నాగుల మల్యాల గ్రామానికి చెందిన నిఖిత ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉదయం ఆమెకు సిజేరియన్ చేయగా.. నలుగురు పిల్లలు జన్మించారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు.. ఇద్దరు మగపిల్లలు. నలుగురు ఆరోగ్యంగానే ఉన్నా.. బరువు కాస్త తక్కువగా ఉండడంతో.. ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. నిఖిత ఆమె సోదరి లిఖిత కూడా కవలపిల్లలు. అలాగే నిఖిత సోదరి లిఖిత కూడా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.