MLA Komatireddy : పంచాయతీ కార్యదర్శుల పనివేళలు మారాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు గ్రా మాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. స్వచ్ఛ మునుగోడు కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యా ప్తంగా డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. గ్రామ పంచాయతీలలో నెలకొన్న సమస్యలు - వాటి పరిష్కారం, చెపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యద ర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బందికి రెగ్యులర్ గా జీతాలు వస్తున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శుల పని వేళలు ప్రాక్టికల్ గా ఉండాలన్న రాజ్ గోపాల్రెడ్డి... మునుగోడు నియోజకవర్గంలో పనిచేసే ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలన్నారు. గ్రామాలలో చెత్త సేకరణ, మురుగు కాలువల నిర్వహణపై దృష్టి పెట్టాల న్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వ ద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, నిజమైన నిరుపేద లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.