Cyberabad Police : రాంగ్ రూట్.. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి..!

Update: 2025-05-04 07:15 GMT

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు ఓ వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ట్రాఫిక్ జామ్స్ తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీస్ లేని ప్రాంతాల్లో రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారుల ఫోటోలు తీసే అధికారాన్ని సాధారణ ప్రజలకు, వాహనదారులకు కల్పించారు. ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్లినట్లు గమనిస్తే.. వారి వాహనం ఫోటో తీసి తమకు పంపిస్తే.. అలాంటి వారికి ఫైన్లు విధిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు. ట్రాఫిక్ రూల్ను అతి క్రమించి రాంగ్ రూట్ లో వెళ్లే వాహనాల ఫోటోలు, వీడియోలు తీసి పంపాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి ఫోటోలు వీడియోలను తమ వాట్సాప్ నెంబర్ 9490617346కు పంపించాలని.. వాటితోపాటు ఆ వాహనం లొకేషన్, టైమ్, డేట్ వంటి పూర్తి వివరాలను పంపించాలని ట్వీట్ లో సూచించారు. రాంగ్ సైడ్ లో వెళ్లిన వారికి ఫైన్ వేయనున్నారు.

Tags:    

Similar News