Mahabubabad : సర్కారీ ఆసుపత్రి నిర్లక్ష్యం.. మానవత్వం చాటుకున్న యువకులు..
Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గార్ల సర్కారీ ఆస్పత్రిలో మహిళ మృతదేహంను ...ఇంటికి తరలించలేని దుస్థితి నెలకొంది
Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గార్ల సర్కారీ ఆస్పత్రిలో మహిళ మృతదేహంను ...ఇంటికి తరలించలేని దుస్థితి నెలకొంది. అందుబాటులో అంబులెన్స్ లేకపోవటంతో ఏం చేయాలో... కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. వాహనాల కోసం ఆరాతీస్తే ఎలాంటి స్పందన లేకపోవటంతో కన్నీమున్నీరయ్యారు. దీంతో ఆస్పత్రి ఆవరణలోనే మృతదేహంతో పడిగాపులు పడ్డారు. విషయం తెలుసుకున్న కొందరు యువకులు వీల్‌చైర్‌పై మృతదేహంను ఇంటికి తరలించారు. మానవత్వం చాటుకున్న యువకులను పలువురు అభినందించారు.