వావి వరసలు మరిచిపోయి తండ్రీ కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్టయ్యాడు. బెంగళూరులో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడకు తరలిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి అడ్డగోలుగా అతడు చేసిన అసభ్యకర కామెంట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తీవ్ర చర్చలకు దారి తీశాయి. హీరో సాయి తేజ్ దీన్ని బయటపెట్టడంతో సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు ప్రణీత్‌పై కేసు నమోదు చేశారు.
తాజాగా ప్రణీత్ హనుమంతును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్ హనుమంతును హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తో పాటు అతని స్నేహితులలో మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.