YS Sharmila : సీఎం జగన్, నేను వేరు కాదు.. జగన్ పని జగన్‌ది.. నా పని నాది: షర్మిళ
YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామన్నారు వైఎస్ షర్మిళ. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్య నేతలతో చర్చలు జరిపారు.;
ys jagan, ys sharmila
YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామన్నారు వైఎస్ షర్మిళ. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదన్నారు షర్మిళ. తెలంగాణలో వైఎస్సార్ లేని లోటు ఉందన్న ఆమె.. రాజన్న రాజ్యం తీసుకొస్తామన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడానని, మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతామన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు షర్మిళ. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ నృత్యాలతో సందడి చేశారు.