తనదైన స్టైల్ లో దూసుకుపోతోన్న అరవింద్ కృష్ణ
ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో యంగ్ హీరో అరవింద్ కృష్ణ;
క్లాసీ లుక్స్ తో బాలీవుడ్ హీరోలనే తలదన్నేంత అందగాడు... తనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్ తో అమ్మాయిలకు నిద్రపట్టకుండా చేసే ఆరుడుగుల ఆజానబాహుడు అరవింద్ కృష్ణ... ఆచి తూచి కథలు ఎంపిక చేసుకుంటూ యాక్టర్ గా ఒక్కో అడుగూ ఎంతో జాగ్రత్తగా వేస్తున్నాడు. ఆలస్యం అమృతం సినిమాలో సపోర్టింగ్ రోల్ ద్వారా తెరకు పరిచయం అయిన అరవింద్, ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాతో హీరోగా మారాడు. రిషిలో టైటిల్ రోల్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈడు గోల్డ్ ఎహెలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇటీవలే శుక్ర సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కొన్ని వారాల పాటు ట్రెండ్ అయింది. రామారావు ఆన్ డ్యూటీతో విలన్ గానూ వెప్పించిన అరవింద్ ప్రస్తుతం "ఏ మాస్టర్ పీస్"లో అనే సూపర్ హీరో సినిమాలో నటించబోతున్స్తునాడు. "గ్రే- ది స్పై హు లవ్డ్ మీ" అనే సినిమాతో మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటోన్న అరవింద్ నేషలన్ లెవెల్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కూడా. ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్‌లో హైద్రాబాద్ తరుపున అరవింద్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఏమైనా... ఈ హ్యాండ్సమ్ హీరో అటు క్రీడల్లోనూ, ఇటు సినిమాల్లోనూ రాణిస్తాడని ఆశిద్దాం.